Thu. May 16th, 2024

“ఎఫ్టా”

Mar 31, 2024
  • సమీప భవిష్యత్తులోనే ప్రపంచంలో 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే లక్ష్యంతో భారత్ వివిధ దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటోంది.
  • ఈ క్రమంలో ఐరోపా స్వేచ్ఛాయుత వాణిజ్య సంగం (ఎఫ్టా) తో ఇటీవల ఒప్పందం కుదిరింది. (4 దేశాలతో).  “ఎఫ్టా” ఒక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. ఇది ఐరోపా సమాఖ్య (EU) కు భిన్నమైనది.
  • ఎఫ్టా లోని సభ్య దేశాలు :- 1. స్విట్జర్లాండ్, 2. ఐస్ లాండ్, 3. నార్వే, 4. లిక్టన్ స్టెన్ – VADUZ (కరెన్సీ CRONA)
  • దీనివల్ల దేశంలో వర్తక వృద్ధి, ఉపాధి అవకాశాలు విస్తృతమవుతాయి.
  • గత 10 సం|| లో భారత్ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 10 స్థానం నుండి 5 స్థానంకు ఎగబాకింది.
  • “ఎఫ్టా” తో పందానికి భారత్ 2008 నుంచి ప్రయత్నాలు చేస్తోంది.
  • ఇంతవరకు “ఎఫ్టా” ఒప్పందాలు చేసుకున్న దేశాలు:-
  • చైనా, కెనడా, దక్షిణ కొరియా (వంటి 40 దేశాలతో 29)
  • “ఎఫ్టా” దేశాలకు 2022 నుంచి 2023లో భారత్ ఎగుమతుల విలువ – 192 కోట్ల డాలర్లు.
  • “ఎఫ్టా” దేశాలకు భారత్ ఎక్కువగా ఎగుమతి చేసేవి :- రసాయనాలు, రత్నాలు, వజ్రాలు, ఔషధాలు, బోట్లు, నౌకలు, దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు.
  • 2000 ఏప్రిల్ – 2023 డిసెంబర్ మధ్య భారత్ కు స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన FDI లు – 1000 కోట్ల డాలర్లు.
  • భారత్ లో 12వ అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిదారు – స్విట్జర్లాండ్.
  • తాజా ఒప్పందం వల్ల భారత్ నుంచి సుంకాలు విధించనివి :- చేపలు, మాంసం, వంట నూనెలు, శుద్ధి చేసిన ఆహార ఎగుమతులు.
  • “ఎఫ్టా” దేశాల్లో భారత్ కు బలమైన వాణిజ్య బంధం గల దేశాలు :- స్విట్జర్లాండ్, నార్వే.
  • అంతర్జాతీయ “నవీకరణ సూచీ” లో ఆది నుంచి అగ్రస్థానంలో నిలుస్తున్న – స్విట్జర్లాండ్ .
  • గత (2023 – 24) ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి స్విట్జర్లాండ్ కు జరిగిన ఎగుమతులు :- 134 కోట్ల డాలర్లు; దిగుమతులు:- 1,579 కోట్ల డాలర్లు.
  • స్విట్జర్లాండ్ నుంచి భారత్ కు దిగుమతి అవుతున్నవి :-
  • బంగారం, యంత్రాలు, ఔషధాలు, బొగ్గు, గడియారాలు, సోయాబీన్ నూనె, చాక్లెట్లు మొదలగునవి…
  • భారత్ లోని నోవార్టీస్, రోష్ ఔషధ కంపెనీలు స్విట్జర్లాండ్ వే.
  • స్విస్ వస్తు దిగుమతులపై 7 నుంచి 10 ఏళ్ల వరకు కాలు తొలగించనున్నారు.
  • తద్వారా, చవకగా లభ్యమయ్యేవి :- 1. ట్యూనా, సాల్మన్ వంటి చేపలు; 2. ఆలివ్ , అవకాడో వంటి పండ్లు; 3. ఆలివ్ ఆయిల్, చాక్లెట్లు, బిస్కెట్లు; 4. ఇనుము, ఉక్కు ఉత్పత్తులు.
  • ఎఫ్టా మాదిరిగానే బ్రిటన్ తోను స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి భారత్ ప్రయత్నిస్తోంది.
  • గడిచిన 5 ఏళ్లలో మిత్ర దేశాలతో భారత్ 13 స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది.
  • ఇటీవలే మూడు ఒప్పందాలు కుదుర్చుకున్న దేశాలు :- మారిషస్ , UAE, AUS.
  • “ఎఫ్టా” తో కుదిరిన ఒప్పందం వ్యవసాయ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పెట్టుబడుల ప్రవాహానికి దోహద పడుతుంది.
Share this article now.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *