Wed. May 15th, 2024

“జనపథంలో జానపదం”

Mar 31, 2024
  • దేశ నాగరికత, సంస్కృతులను తెలుసుకోవడానికి జానపద విజ్ఞానమే మూలం.
  • గ్రామాల్లో దృశ్య శ్రావణ మాధ్యమాలు వ్యాప్తి చెందుతుండడం తో జానపద కలలకు ఆదరణ కుంచించుకుపోతోంది.
  • జానపద కళారూపాలు శ్రమజీవుల అలసటను దూరం చేసి ప్రశాంతతను చేకూర్చేవి.
  • రాచరికంలోనూ కళలను ప్రోత్సహించి ఆదరించేవారు.
  • గ్రామ పెద్దలు, భూస్వాములు, కుల పెద్దలు తమకు తోచిన సాయం చేసి కళాకారులకు జీవనోపాధి కల్పించేవారు.
  • గ్రామాల్లో “పెద్ద కర్మ” అనంతరం కథలు చెప్పించడం నేటికీ ఆనవాయితీగా వస్తోంది.
  • తద్వారా ఆయా కుటుంబాల్లో మనోవేదన, అశాంతి తొలగిపోతాయని నమ్మకం..!
  • గ్రామాల్లో ప్రదర్శించే కళా ప్రదర్శనల్లో మానవీయ విలువలు అంతర్భాగంగా ఉండి, సమిష్టి తత్వాన్ని పెంపొందిస్తాయి.
  • తద్వారా, సమాజంలో బంధాలు, బంధుత్వాలు బలపడతాయి.
  • అలాగే పలు కులాలు, మతాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడే అవకాశం అధికంగా ఉంటుంది.
  • వీధి భాగోతం, బుర్రకథ, చిందు యక్షగానం, కోలాటం, భజన వంటి కళారూపాల్లో సామాజిక అంశాలను చేర్చి ప్రదర్శిస్తారు.
  • ప్రభుత్వాలు జానపద కళలద్వారా సంక్షేమ పథకాల గూర్చి ప్రచారం చేస్తున్నాయి.
  • అలనాటి సాంస్కృతిక కళారూపాలను ఇప్పుడు ప్రదర్శించడం తగ్గిపోతోంది.
  • దేశవ్యాప్తంగా జానపద కళలు, సంస్కృతీ పరిరక్షణ వ్యాప్తి కోసం కేంద్రం 7 జోనల్ సాంస్కృతిక కేంద్రాలను నెలకొల్పింది.
  • 7 జోనల్ సాంస్కృతిక కేంద్రాల ప్రధాన కార్యాలయాలు :-
  • పటియాలా, నాగపూర్, ఉదయపూర్, ప్రయాగ్ రాజ్ (అలహాబాద్), కోల్ కతా, దిమాపూర్, తంజావూర్ లలో ఉన్నాయి.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి.
  • భాషా, సాంస్కృతిక పరిరక్షణ సంస్థలు, ఉన్నత విద్యాసంస్థలు, భాషావేత్తలు, చరిత్రకారులు నడుం బిగించాలి.
  • కళా పోషణకు ప్రభుత్వ ప్రసార మాధ్యమాల్లో అధిక ప్రాధాన్యం మివ్వాలి.
  • కళాకారులకు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునే విధంగా శిక్షణ ఇప్పించాలి.
  • డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలపై అవగాహన పెంపొందించాలి.
  • ఆధునిక పోకడలు పెచ్చు మీరుతున్న ప్రస్తుత తరుణంలో విద్యార్థులకు , కళాకారులకు ఏటా ఉత్సవాలు, మేళాలు, సృజనాత్మక ప్రదర్శనలపై దృష్టి పెట్టాలి.
Share this article now.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *