Wed. May 15th, 2024

“పర్యావరణ హితానికే ఓటు”

Mar 31, 2024
  • ప్లాస్టిక్ వ్యర్ధాలు పుడమికి పెను సమస్యగా మారాయి.
  • ఈ నేపథ్యంలో ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా భారత ఎన్నికల సంఘం ( EC) కీలక నిర్ణయం తీసుకుంది.
  • ఎన్నికలను పర్యావరణ హితకరంగా నిర్వహించాలని EC నిర్ణయించి పిలుపునిచ్చింది.
  • ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో ఒకసారి వాడి, పారేసేవే (సింగిల్ యూజ్) సగం దాకా ఉన్నాయి.
  • ( అందులో అత్యధికం పునర్వినియోగానికి వీలులేనివే..!)
  • ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ 2 ఏళ్ళ క్రితం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీ, వినియోగాన్ని నిషేధించింది.
  • వాటిలో కొన్ని ఉదాహరణలు :
  • ప్లాస్టిక్ ప్లేట్లు, చెంచాలు, పోర్కులు, కత్తులు, కప్పులు, గ్లాసులు, స్ట్రాలు
  • అంతేకాక, ఇయర్ బడ్స్, 100 మైక్రాన్ల లోపు PVC బ్యానర్లు తదితర 18 రకాల వస్తువులను నిషేధించింది.
  • గతంలో ప్లాస్టిక్ ను నిషేధించిన రాష్ట్రాలు :- MH, UP, అరుణాచల్, ఢిల్లీ, TN.
  • EC నిర్ణయంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం మరొకసారి తెరపైకి వచ్చినట్లయింది.
  • 1999 నుంచే ప్రచారంలో ప్లాస్టిక్ ను వాడొద్దని EC రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సూచించిన పట్టించుకోవడం లేదు.
  • ఎన్నికల్లో ప్లాస్టిక్ ను వాడొద్దని న్యాయస్థానం కేరళ EC ని ఆదేశించింది.
  • అధికారులు, రాజకీయ పార్టీలు, నాయకులు అందరూ కోర్టు ఆజ్ఞను శిరసా వహించి, ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయ పద్ధతులను ఎంచుకున్నారు.
  • 2019లో కేరళ శాసనసభ ఎన్నికలు పర్యావరణ హితకరంగా జరిగాయి.
  • 2022 లో గోవా అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే మార్గాన్ని అనుసరించి పర్యావరణ హితకరంగా ఎన్నికలు నిర్వహించారు.
  • గోవా ఉత్పత్తిదారులు, హస్తకళల కళాకారుల సహాయంతో పోలింగ్ కేంద్రాల్లో స్థానిక వస్తు సామాగ్రి వినియోగానికి పెద్దపీట వేశారు.
  • ప్లాస్టిక్ కు బదులు ప్రత్యేకంగా తయారుచేసిన “వెదురు బట్టలు” వినియోగించారు.
  • EVM ల చుట్టూ, VV ప్యాట్ ల చుట్టూ ప్లాస్టిక్ అట్ట ముక్కలు కాకుండా వెదురు కర్రలతో చేసిన పలకలు అడ్డుగా పెట్టారు.
  • అంతేకాక, వెదురుతెరలు, వెదురు బోర్డులు వాడారు.
  • పర్యావరణ హితకరంగా ఎన్నికలు నిర్వహించి, కేరళ, గోవా రాష్ట్రాలు మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి.
Share this article now.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *