Mon. Apr 29th, 2024

“బాధ్యతలే బంధనాలు”

Mar 29, 2024
  • (ఉద్యోగం, బాధ్యతల్లో మహిళలు)
  • దేశంలో ప్రతి రంగంలో మహిళల ఉనికి పెరుగుతోంది అయినా భారతదేశ శ్రామిక శక్తిల అతివల వాటా తక్కువే…!
  • శ్రామిక శక్తిలో 60% కి పైగా ఉన్న దేశాలు :- చైనా,AUS, ఆస్ట్రియా, బెలారస్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, జపాన్.
  • భారత్ లో మాత్రం శ్రామిక శక్తి 35.9 % మాత్రమే..!
  • శ్రామిక శక్తిని 50% కి పెంచుకోగలిగితే ఇండియా GDP వృద్ధిరేటు 8% చేరుతుందని, 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యానికి అది ఆలంబనగా నిలుస్తుందని ఇటీవల అభిప్రాయపడింది – ప్రపంచ బ్యాంకు.
  • ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్న మహిళల్లో – 34%
  • ఉద్యోగ, ఇంటి బాధ్యతలను సమన్వయం చేసుకోలేకే ఆ నిర్ణయం తీసుకున్నట్లు అశోకా యూనివర్సిటీ ఉదైతీ ఫౌండేషన్ సంయుక్త అధ్యాయనంలో తేలింది.
  • పురుష ఉద్యోగుల్లో అలాంటి వారి సంఖ్య – 4% శాతం మాత్రమేనని ఆ అధ్యయనంలో గుర్తించారు.
  • ఇంటి పనంతా ఇల్లాలి బాధ్యతేనన్న ఆలోచన ధోరణి మన దేశంలో ఇంకా బలంగానే ఉంది.
  • కేంద్ర కార్మిక శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ”వికసిత్ భారత్ ” కోసం ”శ్రామిక శక్తిలో మహిళలు” పేరిట నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఉపాధి కల్పనలో స్త్రీ పురుషులకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలని వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాలకు పిలుపునిచ్చాయి.
  • మహిళలకు సురక్షిత పని వాతావరణం కల్పించాలని, లైంగిక వేధింపుల నిరోధానికి అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిత్వ శాఖల సూచన..!
  • దేశంలోని 59% కంపెనీలో లైంగిక వేధింపులపై ఫిర్యాదులు తీసుకునే అంతర్గత కమిటీలు లేవని ”ఉదైతీ ఫౌండేషన్” నివేదిక..!
  • పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల ఘటనలు చాలావరకు మరుగున పడిపోతున్నాయి.
  • మొత్తం బాధితుల్లో అటువంటి నిస్సహాయ అతివల సంఖ్య – 70% దాకా ఉంటుందని అంచనా..!
  • వ్యాపార సంస్థల నాయకత్వ స్థానాల్లోకి మహిళల ప్రవేశం ఇంకా కష్టంగానే ఉంది.
  • “NIFTY – 50” కంపెనీల్లో(NSE లో అతిపెద్ద వైన 50 సంస్థల్లో) MD , CEO, CFO, ఫైనాన్స్ డైరెక్టర్ వంటి కీలక బాధ్యతలు నిర్వర్తించే 146 మంది, ఉన్నత అధికారుల్లో మహిళలు కేవలం – 6 గురు మందే..!
  • NSE లో నమోదైన మిగిలిన 2000 లకు పైగా కంపెనీల ఉన్నత స్థానాల్లోనూ స్త్రీల వాటా చాలా తక్కువ గానే ఉన్నట్లు ఒక సర్వేలో తేలింది.
  • శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెరగాలంటే, అమ్మాయిలను అన్నింట వెనక్కి లాగే మూస ఆలోచన ధోరణులను విడనాడాలి.
  • ఆ దిశగా సమాజంలో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వాలు చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలి.
  • అన్ని సంస్థల్లో లైంగిక వేధింపుల కమిటీలను ఏర్పాటు చేయాలి.
  • మాతృత్వ సెలవుల మంజూరు, ఉద్యోగినుల చంటి పిల్లల సంరక్షణకు కార్యాలయాల్లో తగిన వసతులు విధిగా కల్పించాలి.
  • అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
  • సమాన పనికి సమాన వేతనం ద్వారా శ్రమ దోపిడిని నివారించాలి.

“వృద్ధాశ్రమాలకు జియో ట్యాగింగ్

  • ప్రజా రవాణా, కనీస మౌలిక సదుపాయాలున్న ప్రాంతంలో వృద్ధాశ్రమాలను నెలకొల్పాలనీ , ప్రభుత్వ ప్రైవేటు వృద్ధాశ్రమాలన్ని జియో ట్యాగింగ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
  • ఆదాయమే లక్ష్యంగా, కనీస మౌళిక సదుపాయాలు లేకుండా వృద్ధాశ్రమాలు నడుపుతున్న ప్రైవేటు సంస్థ లను నియంత్రించాలని నిర్ణయించింది కేంద్రం.
Share this article now.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *