Mon. Apr 29th, 2024

“అడవులకు ఆగని రంపపు కోత”

Mar 29, 2024
  • భూమి మీద విస్తరించిన అడవుల శాతం – 31%.
  • ప్రపంచ జనాభాలో మూడవ వంతు ప్రజలు వంట చెరుకు కోసం అడవుల పై ఆధారపడుతున్నారు.
  • అడవులకు సమీపంలోని గ్రామాల ప్రజలు వారి ఆదాయంలో 4 వ వంతు అడవుల నుంచే పొందుతున్నారని అంచనా..!
  • అడవులు – 68% క్షీరదాలకు, పక్షులకు – 75%, ఉభయచరాలకు – 80% ఆవాసం కల్పిస్తున్నవి.
  • 2022 నాటి ప్రపంచ అడవుల స్థితిగతుల నివేదిక ప్రకారం 1990 – 2020 మధ్యలో 104 కోట్ల ఎకరాల అడవులు కనుమరుగయ్యాయి.
  • ప్రపంచ అటవీ విస్తీర్ణంలో తరిగిపోయిన శాతం – 10%.
  • (మార్చి 21) అంతర్జాతీయ అటవీ దినోత్సవం.
  • 2010 – 2020 మధ్య అత్యధికంగా అటవీ నష్టం జరిగినది దక్షిణ అమెరికా, ఆఫ్రికాల్లోనే…!
  • ఇండియా “అటవీ స్థితిగతుల నివేదిక – 2021” ప్రకారం దేశంలో దట్టమైన అడవులు పెరిగినప్పటికీ మధ్యస్థ సాంద్ర అడవులు క్షీణించాయి.
  • దేశంలో కార్చిచ్చులకు గురవుతున్న అడవులు – 35%.
  • కార్చిచ్చుల ముప్పు అధికంగా ఉన్న ప్రాంతాలు :- ఈశాన్య ప్రాంతాలు, పశ్చిమ మహారాష్ట్ర, దక్షిణ ఛత్తీసగఢ్; మధ్య ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్; తెలంగాణ మొదలగునవి.
  • ప్రపంచవ్యాప్తంగా 90% అడవుల నష్టానికి వ్యవసాయ విస్తరణే కారణం..!
  • వ్యవసాయేతర కార్యకలాపాల కోసం అమెజాన్ అడవులు నిర్మూలనకు గురవుతున్నాయి.
  • దక్షిణ అమెరికాలోని వర్షారణ్యాలు అమెరికా వర్షపాతంపై ప్రభావం చూపుతాయని, ఆగ్నేయాసియా అడవులు, ఆగ్నేయ ఐరోపా, చైనాల వర్షపాత సరళిని ప్రభావితం చేస్తాయని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
  • అడవులకు నష్టం వాటిల్లడం వల్ల స్థానికంగా, ప్రాంతీయంగా ఉష్ణోగ్రత, వర్షపాతాల మీద గణనీయ ప్రభావం ఉంటుంది.
  • దక్షిణ బ్రెజిల్ అమెజాన్ ప్రాంతంలో అటవీ నష్టం కారణం గా వర్షపాతం తగ్గడంతో 2050 వరకు ఏటా 100 కోట్ల డాలర్లకు పైగా పంట నష్టం, సోయాబీన్ దిగుబడి తగ్గుదల పశు సంపద నష్టం చోటు చేసుకుంటుందని అంచనా..!
  • ఇటీవల కాలంలో పెచ్చరిల్లుతున్న వాతావరణ మార్పులు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నవి.
  • ఈ మార్పులు కార్చిచ్చులు, తెగుళ్లకు దారితీస్తున్నాయి.
  • ఒక అధ్యయనం ప్రకారం – 2003 -18 మధ్యకాలంలో 29% నుంచి 37% దాకా అడవులు కార్చిచ్చుల బారిన పడ్డాయి.
  • ప్రపంచవ్యాప్తంగా 2021లో కార్చిచ్చుల వల్ల వృక్ష సంపద కు కలిగిన నష్టం – 2.22 కోట్లు.
  • అడవులు కర్బనాన్ని నిక్షిప్తం చేయడంతో పాటు సూర్యకాంతిని, వాతావరణం లో నీటి ఆవిరిని ప్రభావితం చేస్తాయి.
  • అంతేకాక, వేసవిలో వృక్షాలు భూపరితల ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి.
  • జనాభా పెరుగుదల, అటవీ ప్రాంతాల్లోకి మానవ కార్యకలాపాలు విస్తరించడం, అడవులు దెబ్బతినడం వంటి కారణాలతో మనుషులు, వన్యప్రాణుల మధ్య సాహచర్యం పెరుగుతోంది.
  • ఫలితంగా” బ్యూబోనిక్” ప్లేగు, సార్స్, COVID – 19 వంటి జంతు సంబంధిత వ్యాధులు రవళి మానవ మనుగడకు పెద్ద సవాలు గా మారుతోంది.
  • 1960 నుంచి బయటపడిన వ్యాధుల్లో 30% పైగా భూ వినియోగంలో మార్పులు, ముఖ్యంగా అడవుల నరికివేత, వంటివే కారణం..!
  • కొత్తగా ఉద్భవిస్తోన్న 250 సాంక్రమిక వ్యాధుల్లో 15% కి అడవుల నష్టమే కారణమని ఒక అధ్యయన నివేదిక.
  • 2014 – 16 మధ్యకాలంలో “ఎబోలా” పశ్చిమ ఆఫ్రికా ప్రాంతాల్లో వేల మంది మరణానికి కారణమైంది.
  • 2030 నాటికి అడవి నష్టాన్ని, భూ  క్షీణతను నిలువరించడానికి కృషి చేస్తామంటూ “COP – 26”, “వాతావరణ సదస్సు” సందర్భంగా 141 దేశాలు సంయుక్త ప్రకటన చేశాయి.
  • ఇందుకోసం అటవీ నష్టాన్ని అడ్డుకోవడం అటవీ నిర్వహణ క్షీణించిన భూముల పునరుద్ధరణ, వ్యవసాయ ఆధారిత అడవుల పెంపకాన్ని విస్తరించడం, అడవుల సుస్థిర వినియోగం వంటి మార్గాలను లక్షించారు.
Share this article now.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *