Mon. Apr 29th, 2024

“ఎన్నికల సంఘం విశ్వసనీయత”

Mar 28, 2024
  • క్రమం తప్పకుండా స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు నిర్వహించడం నిర్వచన్ సదన్(ఎన్నికల సంఘం) రాజ్యాంగబద్ధమైన విధి.
  • రాజీలేని స్వతంత్రత, నిష్పాక్షికత, నిజాయితీ కేంద్ర ఎన్నికల సంఘంలో ఉట్టి పడాలని గత సంవత్సరం 2023 మార్చిలో స్పష్టం చేసిన సుప్రీం నిర్వచనా సదన్ నియమా నియామకాలపై కేంద్ర ప్రభుత్వ గుత్త పెత్తనం పోవాలని నిర్దేశించింది.
  • చట్టం రూపకల్పనలో సుప్రీం తీర్పు స్ఫూర్తికి నీళ్లు వదిలారని దాఖలైన వ్యాజ్యాలు సర్వోన్నత న్యాయస్థానంలో పెండింగ్ లో ఉండగానే – EC అరుణ్ గోయల్ అర్ధాంతర రాజీనామాతో వివాదం మొదలైంది.
  • 35 ఏళ్ల సర్వీసులో 40 వివాదాల పదవులు నిర్వహించిన అరుణ్ గోయల్ EC గా నియమించబడటం, తప్పుకోవడం రెండూ కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్రతపై నీడలు ప్రారంభమయ్యాయి.
  • గతంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ హోదాలో M.S గిల్ భూటాన్ పర్యటనలో ఎన్నికల ఫలితాలు – పార్టీల ఆమోదంపై వచ్చిన సందేహంపై గిల్ సమాధానం” ఇండియాలో ఎన్నడూ ఏ రాజకీయ పార్టీ ఎన్నికల సంఘం పట్ల విశ్వాస రాహిత్యాన్ని ప్రకటించలేదని” చెప్పడం భారత ప్రజాతంత్ర ఔన్నత్యాన్ని చాటింది.
  • ఆ రోజులు గతించినట్లు ఎన్నికల ప్రక్రియ పవిత్రతను కాపాడాలంటూ గత సంవత్సరం (2023) ఆగస్టులో 89 మంది మాజీ సివిల్ సర్వెంట్లు ఎలక్షన్ కమిషన్ కు బహిరంగ లేఖ రాశారు.
  • తమిళనాడు శేషన్ వంటి నైతిక నిష్టా గరిష్టుడి సారథ్యంలో EC తేజరిల్లేలా కమిషనర్ల నియామకం సాగింది.
  • ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారని, ఆ నియామకాలు పార్లమెంటు చేసే చట్టానికి లోబడి ఉంటాయని తెలిపే అధికరణ – 342(A).
  • 342(A) అధికరణ పై రాజ్యాంగ నిర్ణయ సభలో జరిగిన చర్చలో ఉభయ సభల్లో 2/3 వంతు మంది విశ్వాసం చూరగొనే వ్యక్తుల్నే నిర్వచనం సదన్ లో నియమించాలన్న ప్రతిపాదనలు వచ్చాయి.
  • ప్రధాని నేతృత్వంలో C.J, న్యాయశాఖ మంత్రి, పార్లమెంటు ఉభయ సభల్లో విపక్ష నేతలతో ప్రత్యేక “కొలీజియాను” ను ఏర్పాటుచేసి, EC నియామకాలు చేపట్టాలని సూచించిన వారు – “భారతరత్న” L.K అద్వానీ.(గతంలో)
  • పార్లమెంటు పరిధిలోని అంశంలో భారత CJ పాత్ర ఎందుకన్నా కేంద్ర వాదన సరైనదే అనుకున్న ఈసీ నియామక కమిటీ మరింత విస్తృతంగా ఉండి, అన్ని పార్టీల ఏకాభిప్రాయం ప్రకారమే ఎన్నికల సంఘం సభ్యుల రాజ్యాంగ నైతికతను నిలబెట్టుతుంది.

“డిపాజిట్ గల్లంతైనా పోటీకి సై

  • తొలి ఎన్నికలు జరిగిన 1951 నుంచి ఇప్పటిదాకా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన వారి సంఖ్య 91,160 మంది కాగా, డిపాజిట్ గల్లంతయిన వారి సంఖ్య 71,246 మంది (78%)
  • 2019లో డిపాజిట్లు దక్కని వారి శాతం – 86%
  • మొదట్లో అభ్యర్థుల సెక్యూరిటీ డిపాజిట్ జనరల్ Rs.500/- , SC,ST లకు Rs.250/- ఆ తర్వాత ఎవరు పడితే వారు నామినేషన్ వేసేసరికి, దాన్ని అడ్డుకోవడానికి ఎన్నికల సంఘం జనరల్ వారికి రూ .25000/- , SC, ST లకు -12,500/- గా పెంచి, నిర్ణయించింది.
  • 2014 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన వారు – 8,251 కాగా, 7000 మంది (84%) డిపాజిట్లు కోల్పోయారు.
  • “జాతీయ పార్టీల పరిస్థితి మేలు”:-
  • 1951-52 లో జాతీయ పార్టీల నుంచి పోటీ చేసిన వారు – 1217 మంది.
  • (కాగా డిపాజిట్లు కోల్పోయిన వారు – 344 మంది (28%)
  • 2009లో జాతీయ పార్టీల తరఫున అత్యంత చెత్త రికార్డు :- పోటీదారులు – 1623 మంది (779 మంది డిపాజిట్లు కోల్పోయిన వారు – 40% పైగా.)

సుప్రీం కీలక నిర్ణయం :

  • రాజకీయపక్షం పేరు : “NCP”- శరత్ చంద్ర పవార్, ఎన్నికల గుర్తు “బాకా”ను కొనసాగించాలని EC కి సుప్రీం మంగళవారం (మార్చి 19) ఆదేశం.
  • కాగా, అజిత్ పవార్ వర్గాన్నే “అసలైన NCP” గా గుర్తించి, పార్టీ జెండా ఎన్నికల గుర్తు “గడియారం” ను కేటాయించింది.

గవర్నర్ రాధాకృష్ణన్ బాధ్యతలు

  • T.G రాష్ట్ర మూడవ గవర్నర్ గా ప్రస్తుత ఝార్ఖండ్ గవర్నర్ CP రాధాకృష్ణన్ చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే ప్రమాణం చేయించారు.
  • 22-03-24 న అగ్నికుల్ తొలి రాకెట్ ప్రయోగం స్పేస్ స్టార్టప్ సంస్థ – కాస్మోస్ Pvt Ltd. తన మొదటి రాకెట్ అగ్ని బాన్ ను శుక్రవారం (22-03-24) రోజు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAR) లోని ప్రత్యేక వేదిక నుంచి ప్రయోగించనున్నారు.
  • దీని ప్రత్యేకత :- “3D ఇంజన్ ప్రింటింగ్” విధానంలో రూపొందించిన రాకెట్.
Share this article now.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *